
ట్యాగ్ · 2 కథనాలు


మైఖేల్ ట్రైలర్ కోసం వీరసింహారెడ్డి

సందీప్ కు అదృష్టం కూడా తోడుకావాలి
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్, ప్యాషన్ తో పాటు అదృష్టం కూడా తోడుండాలి. అదృష్టం అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ అదృష్టం లేక ఎంతో మంది హీరోలు ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక అలాంటి వారిలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా ఎందుకో సాలిడ్ హిట్ అనేది కొట్టలేకపోతున్నాడు. చేయడానికి విభిన్నమైన కథలను చేస్తున్నా సక్సెస్ రావడంలేదు. అందుకే తనకు అదృష్టం కూడా తోడుకావాలి అని కోరుకుంటున్నాడు హీరో నాని. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్.

మైఖేల్ ట్రైలర్ కోసం వీరసింహారెడ్డి
టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే…