
ట్యాగ్ · 3 కథనాలు


డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో

పొన్నియన్ సెల్వన్ 2 ఇంట్రెస్టింగ్ అప్ డేట్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి
సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గీతాంజలి " మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "గీతాంజలి " మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో
నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్, చెక్క చివంద వానమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం రాజ రాజ చోళన్ రాజవంశం నేపథ్యంలో ఒక మూవీ రూపొందించనున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.