
ట్యాగ్ · 2 కథనాలు


'పొన్నియన్ సెల్వన్' కూడా రెండు పార్ట్ లుగా..!

పొన్నియన్ సెల్వన్ 2 ఇంట్రెస్టింగ్ అప్ డేట్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.

'పొన్నియన్ సెల్వన్' కూడా రెండు పార్ట్ లుగా..!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ పెద్ద సినిమాలు నిర్మించడానికి ఇన్ఫిరేషన్ గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. ఆసినిమా వల్లే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్ సినిమాలే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు మరో విషయంలో కూడా బాహుబలి సినిమా కూడా ఇన్ఫిరేషన్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా వల్ల కె.జి.యఫ్ ను రెండు పార్ట్ లుగా తీస్తుండగా.. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాను కూడా ఇప్పుడు రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు సలార్ ను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా రెండు…