విజయ్ వారిసు రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Varisu Release Date Fixed, Varisu Release Date Fixed, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vijay Latest Movie, Vijay Upcoming Movies, Vijay Movies, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Movie, Vaarasudu Telugu Movie, Vaarasudu Update, Vaarasudu News, Vaarasudu Latest News, Vaarasudu New Update, Vaarasudu Movie Live Updates, Vaarasudu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళ్‌లో రంజితమే అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ఇక తెలుగులో కూడా ఈ పాటను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా 2023 సంక్రాంతి రేస్ లో ఉండబోతుంది అని కన్ఫామ్ చేసారు కానీ ఇంత వరకూ రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా యూకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఈ సినిమా కన్ఫర్మ్ చేసేసారు. దీంతో ఇన్ని రోజులు ఆసక్తికరంగా ఎదురుచూసిన ఈసినిమా రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చేసింది.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =