టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి యశోద సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. మరోవైపు సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ విషయాన్ని ఈమధ్య తానే స్వయంగా వెల్లడించడంతో ఫ్యాన్స్ అయితే షాక్ కు గురయ్యారు. అందరూ సామ్ కు త్వరగా తగ్గిపోవాలని సోషల్ మీడయా వేదికగా కోరుకున్నారు. నిజానికి సామ్ యశోద సినిమా షూటింగ్ సమయం దగ్గరనుండే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సామ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ గత రెండుమూడు రోజుల నుండి సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందన్న వార్తలు జోరుగా సాగాయి. ఇక ఈవార్తలపై సామ్ టీమ్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ.. కావాలనే కొందరు సమంత గారి హెల్త్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆమె ప్రస్తుతం తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటున్నారని, దయచేసి ఎవరూ అటువంటి పుకార్లు నమ్మవద్దని సమంత ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం సమంత తెలుగులో చేసిన శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. దీనిలో పాటు విజయ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























