
ట్యాగ్ · 2 కథనాలు


సామ్ హెల్త్ ఇష్యూపై క్లారిటీ

ఖుషి-సమంత పై టీమ్ క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మహానటి తర్వాత విజయ్‌దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈసినిమాలో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై…

సామ్ హెల్త్ ఇష్యూపై క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి యశోద సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. మరోవైపు సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ విషయాన్ని ఈమధ్య తానే స్వయంగా వెల్లడించడంతో ఫ్యాన్స్ అయితే షాక్ కు గురయ్యారు. అందరూ సామ్ కు త్వరగా తగ్గిపోవాలని సోషల్ మీడయా వేదికగా కోరుకున్నారు. నిజానికి సామ్ యశోద సినిమా షూటింగ్ సమయం దగ్గరనుండే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సామ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.