
ట్యాగ్ · 3 కథనాలు


సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

స్పై జోనర్ చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు (1965) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. 5 దశాబ్దాలపాటు సుమారు 350 సినిమాలలో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించారు. సాహసాలకు , ప్రయోగాత్మక చిత్రాలకు హీరో కృష్ణ పెట్టింది పేరుగా మారారు. మైథలాజికల్, డ్రామా, వెస్టర్న్, ఫాంటసీ, యాక్షన్, స్పై జోనర్తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో హీరోగా నటించి కృష్ణ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా అభిమానులు ఒక్క కృష్ణనే హీరో కృష్ణగా పిలవడం విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్
తెలుగు సినీ పరిశ్రమలో మహామహులకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ అసాధ్యుడిగా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆయన సాధించిన పలు రికార్డులు నేటికి చెక్కుచెదరలేదు.తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం కృష్ణ రికార్డులు శాశ్వతంగా నిలిచిపోతాయి.హీరోగా అత్యధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్కువ మంది దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కృష్ణనే యాభై ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 108 మంది దర్శకులతో కృష్ణ సినిమాలు చేశారు.

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన కృష్ణ తేనెమనసులు (1965) చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350 సినిమాలలో నటించిన కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందారు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు) వంటి రికార్డ్స్ ను కృష్ణ క్రియేట్ చేశారు. హీరో , నిర్మాత , దర్శకుడు , స్టూడియో…