
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమాకు ముందు నేను దర్శకత్వం వహించాలని అనుకున్నాను, అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని అనుకున్నా…