అజిత్– హెచ్ వినోద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తునివు సినిమా వస్తుంది. ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు.. ఇక ఎలాంటి బ్రేకులు లేకుండానే ఈసినిమా షూటింగ్ మాత్రం త్వరగానే పూర్తిచేసుకున్నారు చిత్రబృందం. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా పూర్తిచేసే పనుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్ తన డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేసుకుంటున్నట్టు అప్ డేట్ వచ్చింది. తన చివరి డబ్బింగ్ వర్క్ ని అయితే కంప్లీట్ చేసేసారట అజిత్.
కాగా ఈసినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను సంక్రాంతి రేస్ లో బరిలోకి దింపనున్నారు. మరి ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: