సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్

sundeep kishan michael movie teaser out now, michael movie teaser out now, sundeep kishan michael movie, michael movie teaser, Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Divyansha Kaushik, Michael, Michael Telugu movie, Michael New Update, Michael Telugu Movie New Update, Michael Movie, Michael Latest Update, Michael Movie Updates, Michael Telugu Movie Live Updates, Michael Telugu Movie Latest News, Michael Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈమధ్య టాలీవుడ్ యంగ్ హీరోలు జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఉంటాడు. కెరీర్ ప్రారంభంనుండే విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. అయితే గతకొంతకాలంగా మాత్రం సందీప్ కిషన్ ను వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. అయినా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ కిషన్ కెరీర్ లోనే భారీగా ఈసినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈసినిమా టీజర్ రిలీజ్ చేయడం కోసం ఏకంగా 8మంది సెలబ్రిటీలను తీసుకొచ్చారు మేకర్స్. తెలుగులో ఈసినిమా టీజర్ ను నాని రిలీజ్ చేయనున్నారు, ఇంకా తమిళ్ లో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో రాజ్ కుమార్ రావు, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్ అండ్ డీకే చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది.

కాగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 17 =