శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ రిలీజ్ డేట్
Siva Karthikeyan Prince Release Date Locked

కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివ కార్తికేయన్ డాక్టర్ జి, డాన్ వంటి సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో ప్రిన్స్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పాండిచ్చేరి , లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ప్రిన్స్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు శుక్రవారం నిర్మాతలు ప్రకటించారు. లాస్ట్ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లపై ఓ పాటను తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. దీపావళి పండగ కు అక్టోబర్ 24 వ తేదీ ప్రిన్స్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో ప్రిన్స్ సినిమా రూపొందుతోంది. శివకార్తికేయన్ నటిస్తున్న తొలి ద్విభాషా సినిమా ప్రిన్స్ కావడం విశేషం.






