ధమాకా మాస్ రాజా లిరికల్ సాంగ్ రిలీజ్

Mass Raja Lyrical Song Out From Dhamaka Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,Dhamaka Songs,Dhamaka Movie Songs,Dhamaka Telugu Movie Songs,Mass Raja Lyrical Song,Mass Raja Song,Dhamaka Movie Updates,Dhamaka Movie New Song,Dhamaka Movie Live Updates,Ravi Teja Dhamaka Movie Songs,Ravi Teja Dhamaka Songs,Ravi Teja

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా రూపొందిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఆ విషయాన్ని చిత్రయూనిట్ కూడా వీడియో రిలీజ్ చేసి మరీ తెలిపింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటుంది ఈసినిమా. ఇక ఇన్నిరోజులు ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన రొమాంటిక్ గ్లింప్స్, జింతాక్ సాంగ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాాజాగా మాస్ రాజా అనే పల్లవితో సాగే లిరికల్ పాటను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ ని నకాష్ అజీజ్ అద్భుతంగా ఆలపించగా ఈ సాంగ్ కి సూపర్ మాస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ . మాస్ బీట్ తో సాగే ఈపాట యువతని కూడా ఎంతో ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =