స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

Bellamkonda Ganeshs Swathi Muthyam Movie Trailer Release Date and Time Fixed,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Swathi Muthyam,Swathi Muthyam Movie,Swathi Muthyam Telugu Movie,Swathi Muthyam Movie Latest Updates,Swathi Muthyam Movie Trailer Released Date Fixed,Swathi Muthyam Movie Release Date and Time Fixed,Bellamkonda Ganeshs Swathi Muthyam Movie Trailer Latest Updates,Bellamkonda Ganeshs Upcoming Movie Swathi Muthyam,Swathi Muthyam Bellamkonda Ganeshs Upcoming Movie

బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వస్తున్న మరో హీరో బెల్లంకొండ గణేష్. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. రీసెంట్ గానే గణేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి టీజర్ ట్రైలర్ అంటూ ఒక వీడియో ను రిలీజ్ చేశారు. టీజర్ ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్లెజెంట్ గా ఉందని.. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ ఇంకా ఫన్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా ట్రైలర్ ను ఈనెల 26వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =