
ట్యాగ్ · 4 కథనాలు


'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ

స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వస్తున్న మరో హీరో బెల్లంకొండ గణేష్. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల అవుతోంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. రీసెంట్ గానే గణేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి టీజర్ ట్రైలర్ అంటూ ఒక వీడియో ను రిలీజ్ చేశారు. టీజర్ ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్లెజెంట్ గా ఉందని.. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ ఇంకా ఫన్ కూడా…

గణేష్ బెల్లంకొండ 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లలో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరని చెప్పొచ్చు. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు బెల్లంకొండ సురేష్. ఇక బెల్లంకొండ సురేష్ వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా చాలా లేట్ అయింది. అయితే ఈమధ్యే మళ్లీ ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే…

'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి గణేష్ బెల్లంకొండ ఎప్పుడో అరంగేట్రం చేయాలి కానీ అనుకోని పరిస్థితుల్లో మొదటి సినిమా ఆగిపోయింది. ఇక వెంటనే ఎలాంటి నిరాశ చెందకుండా రెండో సినిమాను లైన్ లో పెట్టేసి ఇప్పుడు దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు గణేష్ బెల్లంకొండ. లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకత్వంలో గణేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. త్వరలోనే షూట్ పూర్తి కానుంది.

కమల్ హాసన్ అద్వితీయ అభినయానికి దర్పణం `స్వాతిముత్యం`కి 34 ఏళ్ళు
వైవిధ్యభరిత పాత్రలకు పెట్టింది పేరు లోకనాయకుడు కమల్ హాసన్. స్వతహాగా తమిళ కథానాయకుడైనప్పటికీ... దేశవ్యాప్తంగా అశేష అభిమానగణాన్ని పొందారాయన. ఇక తెలుగు పరిశ్రమతోనూ కమల్ కి మంచి అనుబంధమే ఉంది. ఇక్కడ నేరుగా నటించిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా... దర్శకదిగ్గజం కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో కమల్ నటించిన చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. వాటిలో `స్వాతిముత్యం` ఒకటి.