బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ప్రోమో-టికెట్ బుకింగ్స్ ఓపెన్

Brahmastra Advance Bookings Open Now,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan Indai Movie,Brahmastra Movie Latest Updates,Brahmastra Movie Advnace Booking Opens,Brahmastra Movie Advance Bookings,Ranbir Kapoor and Alia Bhatt Brahmastra Movie Advance Booking Started,Advance Bookings For Brahmastra Movie Opens Now,SS Rajamouli,Ayan Mukerji Brahmastra Director

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా భారీ బ‌డ్జెట్ తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్ర పేరుతో రిలీజ్ చేశారు. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర కథాంశం. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న అలియా భట్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం మరో విశేషం. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ప్రోమో పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈవీడియో చూస్తుంటే గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరోసారి ఈ ప్రోమోతో ఈసినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని నిరూపించారు. అంతేకాదు ఇంకా ఈసినిమా రిలీజ్ కు ఆరు రోజులు ఉందని.. ఇంకా ఈసినిమా టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని తెలిపారు. దీనితో పాటు ఐమ్యాక్స్ లో ఈసినిమా 3డీ వర్షన్ ను అందుబాటులో ఉంటుందని.. సెప్టెంబర్ 9న ఈసినిమా రాబోతుందని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

కాగా ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =