తెలుగు పాటతో మెప్పించిన అలియా

Alia Bhatt sings kumkumala song in Telugu,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Alia Bhatt,Bollywood Actress Alia Bhatt,Alia Bhatt Latest Updates,Alia Bhatt Sings Kumkumala Song in Telugu,Alia Bhatt Kumkumala Song in Telugu,Alia Bhatt Kumkumala Song in Telugu,Alia Bhatt Sings in Telugu Kumkumala Song From Brahmastra Movie,Alia Bhatt and Ranbir Kapoor, Alia Bhatt and Ranbir Kapoor Brahmastra Movie Song

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం బ్రహ్మాస్త్ర మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో విజువల్ వండర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈ విజువల్ వండర్ ను చూడటానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో సౌత్ నుండి నార్త్ వరకూ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ భద్రత ఏర్పాట్లలో సమస్యలు రావడంతో ఈవెంట్ రద్దయింది. దీంతో చిత్రబృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రణబీర్, అలియా, నాగార్జున, నిర్మాత కరణ్ జొహార్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలియా భట్ తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె బ్రహ్మస్త్రలో కుంకుమలా నువ్వే చేరగా ప్రియ అనే పాటను తెలుగులో అద్భుతంగా పాడింది. దీంతో అక్కడున్నవాళ్లంతా ఆలియా పాటకు ఫిదా అయ్యారు. తెలుగులో ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తన నటనతో మెప్పించింది. రణబీర్ కపూర్ మాత్రం మొదటిసారి బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈసినిమా వీరిద్దరికీ ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 15 =