విశ్వక్ కోసం ఆర్ఆర్ఆర్ యాక్షన్ కొరియోగ్రాఫర్

Vishwak Sen To Work With RRR Movie Choreographers, RRR Movie Choreographers, RRR Movie Stunt Directors, Vishwak Sen's new film Das Ka Dhumki, Das Ka Dhumki Latest News, Das Ka Dhumki New Update, Das Ka Dhumki Telugu Movie, Vishwak Sen's new Movie, Vishwak Sen's Upcoming Movie, Das Ka Dhumki, Vishwak Sen To Work With RRR Movie Stunt Directors, Stunt Directors, RRR Movie, Vishwak Sen, RRR Fight Masters, Das Ka Dhumki Latest News And Updates, Vishwak Sen's Latest Telugu Movie Das Ka Dhumki, Das Ka Dhumki Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

రీసెంట్ గా ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ ఉన్నాడు. అందులో ఒక సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఈసినిమాలో విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది. ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు.

కాగా ఈసినిమా రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారువన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =