కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

సీతారామం మూవీ హిందీ ట్రైలర్ కు అద్భుత స్పందన

Sita Ramam Hindi trailer gets superb response, Dulquer Salmaan Next Projects, Dulquer Salmaan Sita Ramam Hindi Movie Trailer Out Now, Dulquer Salmaan Upcoming Movies, Latest Telugu Movies News, Sita Ramam, Sita Ramam Dulquer Salmaan Hindi Movie Trail

సీతారామం మూవీ హిందీ ట్రైలర్ కు అద్భుత స్పందన

Sita Ramam Hindi trailer gets superb response

Sita Ramam Hindi trailer gets superb response, Dulquer Salmaan Next Projects, Dulquer Salmaan Sita Ramam Hindi Movie Trailer Out Now, Dulquer Salmaan Upcoming Movies, Latest Telugu Movies News, Sita Ramam, Sita Ramam Dulquer Salmaan Hindi Movie Trail

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. విడుద‌లైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ మూవీ లాభాల బాట ప‌ట్టింది.సెప్టెంబర్‌ 2న సీతా రామం హిందీవెర్షన్ రిలీజ్‌ కానందున సీతారామం మూవీ హిందీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్