"లైగర్" యాటిట్యూడ్ సాంగ్ వీడియో రిలీజ్
E0 B0 B2 E0 B1 88 E0 B0 97 E0 B0 B0 E0 B1 8d E0 B0 Af E0 B0 Be E0 B0 9f E0 B0 Bf E0 B0 9f E0 B1 8d E0 B0 Af E0 B1 82 E0 B0 A1 E0 B1 8d E0 B0 B8 E0 B0 Be E0 B0 82 E0 B0 97 E0 B1 8d

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో "లైగర్" యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ సునీల్ కశ్యప్ స్వర కల్పన లో పూరి జగన్నాథ్ సాహిత్యం , విజయ్ దేవరకొండ ఆలపించారు. ఇలా చిత్రబృందం డిఫరెంట్‌గా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు.విజయ్ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది.









