“విక్రమ్”మూవీ టీమ్ కు కీర్తి సురేష్ కంగ్రాట్స్

Keerthy Suresh Congratulates Vikram Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy suresh,Keerthy Suresh About Vikram Movie,Vikram Movie Celebrity Response,Keerthy Suresh Praises Vikram Movie Team, Keerhty Suresh Congratulates Vikram Movie Makers,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movies,Keerthy Suresh About kamal Haasan Vikram Movie,Kamal Haasan Vikram Movie, Vikram Movie,Vikram Telugu Movie,Kamal Haasan Super Hit Movie Vikram Movie Latest Updates,Vikram Movie Latest Collection Updates,Vikram Movie Collections,Vikram Mvoie Overseas Collections Updates

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్కుకు చేరువలో ఉన్న ఈ మూవీ తెలుగు భాషలో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరడం విశేషం. “విక్ర‌మ్”మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “విక్రమ్”మూవీ టీమ్ కు సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెప్పారు. “విక్రమ్ ” టీమ్ కు పేరుపేరునా కీర్తి ప్రశంసలు కురిపించారు. “విక్రమ్ “మూవీ చూడటం వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్అనీ , ప్రతీ మూమెంట్ పిచ్చెక్కినట్టు అయిందనీ , ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్క టీమ్ మెంబర్‌కు ఈ రేంజ్ విజయానికి అర్హులేననీ , “విక్రమ్” టీమ్ కు కంగ్రాట్స్ అనీ కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =