
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ప్లే బ్యాక్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కేకే గా పాప్యులర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , మరాఠీ , బెంగాలీ , ఒడియా , అస్సామీ , గుజరాతీ భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ తో కేకే ప్రేక్షకులను అలరించారు. "ప్రేమ దేశం" చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్‌గా టాలీవుడ్ కు కేకే పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్ పాటలు ఆలపించగా.. రెండు సూపర్ హిటయ్యాయి. "ఇంద్ర", "సంతోషం", "ఘర్షణ", "గుడుంబా శంకర్", "నువ్వేనువ్వే,", "సైనికుడు" , "నేనున్నాను"లతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడి కేకే ప్రేక్షకులను అలరించారు.