‘బ్రహ్మాస్త్ర’ వైజాగ్ ప్రమోషన్స్ షురూ..

Brahmastra Team Kickstarts Promotions In Vizag,Ranbir Kapoor And SS Rajamouli Brahmastra Promotions In Vizag Started, Event Live On Telugu Filmnagar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Version Movie,Brahmastra Promotion Event at Vizag,Brahmastra Promotion Event Started at Vizag,Rajamouli and Ranbir Kapoor Brahmastra Movie Promotions Started, Brahmastra Movie Promotions Started at Vizaf Watch Live in Telugu Filmnagar,Brahmastra Promotion Event at Vizag Started Event Live Now,Brahmastra Movie Promotions Event Live,Brahmastra Latest Promotions Updates, Ranbir Kapoor and SS Rajamouli Brahmastra Promotions at Vizag Started Watch Live Event on Telugu Filmnagar,Brahmastra Live Event at Vizag

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ బాధ్యతలు దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే హైద్రాబాద్ లో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు రణబీర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వైజాగ్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేశాడు రాజమౌళి. నేడు రాజమౌళి, రణబీర్ కపూర్ వైజాగ్ చేరుకున్నాడు. అక్కడ ఫ్యాన్స్ రాజమౌళికి అలానే రణబీర్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా రాజమౌళి ఇంకా రణబీర్ తో చిట్ చాట్ కు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్న ఈసినిమాకు ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర.. శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”Ry–fCEDtYM,Ju35T2nAfP4,zpFQy2GWs7M,J07cm-USbPU” playlist_auto_play=”0″

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =