మెగా పవర్ స్టార్ అల్లూరి సీతారామరాజుగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “, సిద్ధగా పెర్ఫార్మ్ చేసిన “ఆచార్య మూవీస్ అభిమానులకు డబుల్ ట్రీట్ గా మే 20 వ తేదీ ఓటీటీ లలో స్ట్రీమింగ్ కానున్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ లో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. “ఆచార్య” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20న స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.500 సెంటర్స్ లో 50రోజులు పూర్తి చేసుకున్న“ఆర్ఆర్ఆర్”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.. ఒకే రోజున రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కావడం అభిమానులకు పండగే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























