‘777 ఛార్లి’ ట్రైలర్ రిలీజ్..!

777 Charlie Telugu Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, 777 Charlie,777 Charlie Movie,777 Charlie Telugu Movie,777 Charlie Movie Trailer,777 Charlie Telugu Movie Trailer,777 Charlie Movie Trailer Updates, 777 Charlie Upcoming Movie Trailer,777 Charlie Movie Trailer Released,777 Charlie Trailer Released Out,777 Charlie Trailer,Hero Rakshit Shetty, Rakshit Shetty Latest Movie 777 Charlie Trailer Out Now,Rakshit Shetty Upcoming Movie 777 Charlie Trailer Released Now

కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కత్వంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఛార్లి 777. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైనా కూడా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మళ్లీ ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికొస్తే ధర్మ లోకం వేరు ..నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది. ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌ ఓసారి ఆప‌ద‌లో చిక్కుంటాడు. అప్పుడు ఛార్లి అత‌న్ని బ‌తికిస్తాడు. అప్పుడు ఛార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌కు ధ‌ర్మ మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది.
అలాంటి ఛార్లి, ధ‌ర్మ ఎందుకు కాశ్మీర్‌కి వెళ‌తారు. ఛార్లిని వెతుక్కుంటూ వెళ్లిన ధ‌ర్మ‌కు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులు ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘777 ఛార్లి’ సినిమా చూడాల్సిందే.

కాగా ఇంకా ఈసినిమాలో సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ర‌క్షిత్ శెట్టి హీరోగా నటిస్తూనే జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుద‌ల‌వుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =