
ట్యాగ్ · 3 కథనాలు


'777 ఛార్లి' ట్రైలర్ రిలీజ్..!

రక్షిత్ శెట్టి '777 ఛార్లి' రిలీజ్ డేట్ ఫిక్స్..!

కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్
ఒకప్పుడు శాండల్ వుడ్ మార్కెట్ చాలా పరిమితం.గా ఉండేదన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ , సుదీప్ , దర్శన్ , పునీత్ రాజ్ కుమార్ లు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టినా ఆ మూవీస్ ఇతర భాషల్లో డబ్బింగ్ అయిన శాతం చాలా తక్కువ.ఆ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్ వచ్చాయి.

'777 ఛార్లి' ట్రైలర్ రిలీజ్..!
కిరణ్ రాజ్.కె దర్శకత్వంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఛార్లి 777. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైనా కూడా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మళ్లీ ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రక్షిత్ శెట్టి '777 ఛార్లి' రిలీజ్ డేట్ ఫిక్స్..!
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.