‘మేజర్’ కు మీరే బ్యాక్ బోన్ మహేష్ సార్..!

Adivi Sesh about Mahesh Babu at Major Trailer Launch,Mahesh Babu Speech Highlights: Major Trailer Launch Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Telugu Movie Trailer Launch,Major Trailer Launch,Major Movie Trailer Launch,Major Trailer Launch By Mahesh Babu,Major Movie Trailer Launch By Mahesh Babu, Adivi Sesh Major Movie Trailer launch,Adivi major Trailer launch By Mahesh Babu,Mahesh Babu Speech in Major Movie Trailer Launch,Mahesh Babu Speech in Major Trailer Launch Event, Mahesh Babu Speech Highlights in Adivi Sesh Major Movie Trailer Launch,Mahesh Babu Upcoming Movie,Mahesh Babu Latest Movie Updates,Mahesh Babu Sarkaru Vaari paata Movie Updates

మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఎమోషనల్ రైడర్ గా ఉన్న ఈట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాపై అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈసినిమా ట్రైలర్ ను మహేష్ షేర్ చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి సినిమా తీస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు. ఇక మహేష్ ట్వీట్ కు అడివి శేష్ రిప్లై ఇస్తూ.. అసలు ఈ చిత్రానికి బ్యాక్ బోన్ మీరే సార్.. ఈ సినిమా కోసం మీ ఫీలింగ్ ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. నిన్న రాత్రి ఫోన్ లో మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట నా కళ్లను చెమర్చాయి.. ఆ మాటలతో నా హృదయం నిండిపోయింది అని ఎమోషనల్ గా మహేష్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twenty =