‘డిస్నీ’ లో ‘బ్రహ్మాస్త్ర’ థియేట్రికల్ రిలీజ్..!

Brahmastra Makes It To Disneys Global Theatrical Release Slate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Brahmastra upcoming Movie,Brahmastra Latest Updates,Brahmastra to Disneys Global Theatrical Release,Brahmastra Going to Release in Disneys Global Theatrical, Brahmastra Makes It To Disneys Global,Disneys Global Theatrical Release Slate,Brahmastra Release Updates,Brahmastra movie Release updates,Brahmastra New Movie Release Worldwide

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలుపెట్టి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది కూడా. మధ్యలో కరోనా వల్లే చాలా కాలం టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ముఖ్యంగా రణ్ బీర్, అలియా ల ఇంట్రడక్షన్ వీడియోలను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనుందని అర్థమైపోయింది. ఇక ఈసినిమాలో ఇప్పటికే పలు విశేషాలు ఉండగా ఇప్పుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. ద వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పై లవ్ అండ్ థండర్, థార్-లవ్ అండ్ థండర్, బ్లాక్ పాంథర్-వాకండ ఫరెవర్, అవతార్-ద వే వాటర్ ఇలా పలు సినిమాలు థియేట్రికల్ గా రిలీజ్ అవుతుండగా వీటితో పాటు బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ పార్ట్ శివ కూడా థియేట్రికల్ గా రిలీజ్ కానుంది. ఇండియన్ మూవీ సినిమాస్ లో ఇదే మొదటి సినిమా కావడం ఇదే విశేషం.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర.. శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twelve =