
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. “ఆర్ఆర్ఆర్” ఊహించిన విధంగా సక్సెస్ కావడంతో జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ హాజరయ్యారు.