ట్యాగ్ · 3 కథనాలు

'బీస్ట్' మూడో షెడ్యూల్ స్టార్ట్

"బీస్ట్ "తమిళ మూవీ సెట్స్ లో పూజాహెగ్డే
'బీస్ట్'.. వీర రాఘవన్ గా 'విజయ్'
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్నాడు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా దీనిలో భాగంగా ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా…

'బీస్ట్' మూడో షెడ్యూల్ స్టార్ట్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఇటీవలే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ను కూడా ఇటీవలే మొదలుపెట్టి అది కూడా పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేడు చెన్నైలో ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా.. ఈ షెడ్యూల్ ను త్వరగానే పూర్తి చేయనున్నారట.

"బీస్ట్ "తమిళ మూవీ సెట్స్ లో పూజాహెగ్డే
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.