ఫ్యాన్స్ కు ‘రాధేశ్యామ్’ టీమ్ బంపరాఫర్

Radhe Shyam Team A Bumper Offer To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Pan India Movie,Radhe Shyam Latest Updates,Radhe Shyam Upcoming Movie OF Prabhas,Radhe Shyam New Updates, Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam Team Bumper offer to Fans,Radhe Shyam on March 11th 2022,Prabhas new Movie Radhe Shyam on march 11th,Radhe Shyam Fan love Letter, Radhe Shyam Fan love,Pooja Hegde Movie adhe Shyam,Pooja Hegde With Prabhas,Pooja Hegde Upcoming Movie Radhe Shyam,#LetterForRadheShyam, Radhe Shyam Fan Love Letter Contest,Radhe Shyam Fan Love Letter Contest merchandise,Radhe Shyam Fan Love Letter Contest winner Will get Merchandise,#RadheShyamOnMarch11,#Prabhas,#hegdepooja

రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులు బాగుండి ఉంటే సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది ఈసినిమా కూడా. కానీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గానే మరో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 11న విడుదల కానుందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్‌. ఈనేపథ్యంలో మళ్లీ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కు దాదాపు నెల రోజులు ఉండగా ఈ టైమ్ ను మాత్రం ప్రమోషన్స్ కోసం భారీగా వాడుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా కొత్తగా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక కాంటెస్ట్ నిర్వహించింది. ప్రభాస్ ఫ్యాన్స్ తమ చిత్రయూనిట్ కు ఫ్యాన్ లవ్ పేరుతో లెటర్ రాస్తే.. అందులో గెలిచిన విజేతకు సినిమాకు సంబంధించిన మెర్చెండైజ్ ను పొందవచ్చని తెలిపింది. మరి చూద్దాం ఎవరు ఆ అవకాశాన్ని దక్కించుకుంటారో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ కాగా అవి చాలా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హిందీ ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులే పని చేశారు. ఈసినిమానుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అవి కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

కాగా ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − twelve =