
ట్యాగ్ · 4 కథనాలు


'హరి హర వీరమల్లు'.. డ్యాన్సర్ గా నిధి..!

పవర్ స్టార్ బర్త్ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

'హరి హర వీరమల్లు'.. డ్యాన్సర్ గా నిధి..!
రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక దీనితోపాటు పవన్-క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా మళ్లీ షూట్ ను స్టార్ట్ చేయలేదు.

బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందుకున్నా - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, "ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం "హీరో " “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

'హరి హర వీరమల్లు' నిధి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పటివరకూ సెట్స్ పైకి రాలేదు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఇన్నాళ్లకు ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది.