ట్యాగ్ · 3 కథనాలు
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?
'కె.జి.యఫ్ 2' టీజర్ టైం ఫిక్స్ - కౌంట్ డౌన్ స్టార్ట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ తో వచ్చేసారు కె.జి.యఫ్ 2 టీమ్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను జనవరి 8వ తేదీన ఉదయం 10గంటల 18 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఇటీవలే ట్విట్టర్ ద్వారా ప్రత్యేకమైన పోస్టర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేసి మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రయూనిట్.
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.