ట్యాగ్ · 4 కథనాలు
'కె.జి.యఫ్ 2' టీజర్ టైం ఫిక్స్ - కౌంట్ డౌన్ స్టార్ట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో యశ్ ?
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
పోస్టర్స్ తో క్యూరియాసిటీ పెంచుతున్న 'కె.జి.యఫ్2' టీం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కె.జి.యఫ్ 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమానుండి టీజర్ ను యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇక ఈ నేపథ్యంలో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ నిన్న యష్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఈ రోజు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. 3 డేస్ టు గో అంటూ మొహం కనిపించని ఒక క్యారెక్టర్ పోస్టర్ ను పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.
'కె.జి.యఫ్ 2' టీజర్ టైం ఫిక్స్ - కౌంట్ డౌన్ స్టార్ట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ తో వచ్చేసారు కె.జి.యఫ్ 2 టీమ్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను జనవరి 8వ తేదీన ఉదయం 10గంటల 18 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఇటీవలే ట్విట్టర్ ద్వారా ప్రత్యేకమైన పోస్టర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేసి మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రయూనిట్.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో యశ్ ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో యశ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన "కె జి ఎఫ్ చాప్టర్ 1 " మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించడంతో హీరో యశ్ ఆల్ ఇండియా క్రేజీ హీరోగా మారారు.
హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్1 " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.