ట్యాగ్ · 3 కథనాలు
`విరాటపర్వం` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
'విరాటపర్వం' - కీలక పాత్రలో నివేదా పేతురాజ్
పెళ్లామ్స్ బర్త్ డే - భార్యకు రానా వెరైటీ విషెస్
ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.
`విరాటపర్వం` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
నిన్న వెంకీ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చి అభిమానులను ఫుల్ కుష్ చేశారు. ఇక ఈరోజు రానా పుట్టినరోజు కావడంతో వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక రానా పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు.
'విరాటపర్వం' - కీలక పాత్రలో నివేదా పేతురాజ్
మొత్తానికి టాలీవుడ్ కు మళ్లీ పూర్వ కళ వస్తుంది. చాలా సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది మొత్తం సినిమాల పండగ స్టార్ట్ అవుతుంది. ఇక 'విరాటపర్వం 1992' సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.