
ట్యాగ్ · 4 కథనాలు

స్టార్ హీరోయిన్ త్రిష కు కరోనా పాజిటివ్
తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.
అప్పుడే పెళ్లి చేసుకుంటా - లేకపోతే సింగిల్ గానే ఉంటా
కొంత మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. వారి పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్క వీరి పెళ్లిళ్లపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వీరిలో నయన్ అంటే విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుంది కాబట్టి అది వేరు. కానీ త్రిష, అనుష్క మేము సింగిల్ అని చెప్పినా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తన పెళ్లిపై స్పందించిన త్రిష తనకు ఎలాంటి వాడు కావాలో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అన్న విషయాలు స్పష్టం చేసింది.
త్రిష స్వీట్ మెమొరీ
1999 సంవత్సరంలో సెప్టెంబర్ 30 వ తేదీ 16 సంవత్సరాల వయసు లో "మిస్ చెన్నై "గా క్రౌన్ గెలుచుకున్న త్రిష అదే సంవత్సరం సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 2దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. హీరోయిన్ త్రిష నటించిన తమిళ మూవీస్ "పరమపద విలయాట్టు ", "గర్జన "షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.

నాకు ఇష్టమైన ముగ్గురు హీరోలు వారే..!
'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. 'వర్షం' సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుండటంతో తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం పలు సినిమాలతో బిజీగానే ఉంది.