కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bigg Boss Season 4

ట్యాగ్ · 4 కథనాలు

Bigg Boss 4 Show To Bring Out The Contestants Elimination List For The 6th Week
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 6వ వారం నామినేషన్ లిస్ట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 - ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమ‌వారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు క‌డుగుతుండ‌డాన్ని చూపించారు. అయితే ప‌ర్స‌న‌ల్ క‌ప్పులు కూడా క‌డ‌గ‌కుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త వాదన జరిగింది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్ 4' లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా…

TFN Adminవాట్సాప్
Actor Nandu Quizzes Audience With A Fun Video On Social Media
సినిమా వార్తలు

'BB' అంటే అది కాదు - కన్ఫ్యూజ్ చేస్తున్న నందు

బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంతో ప‌క‌డ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు నిర్వాహ‌కులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్‌-4 షోలో మొత్తం 16 మంది పాల్గొన‌బోతుండ‌గా మ‌రోసారి హోస్ట్‌గా నాగార్జున‌ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జ‌ర‌గ‌నున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?

‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది లాస్య. తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. వారికి ఒక బాబు కూడా వున్నాడు. ప్రస్తుతం భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. అయితే తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్