
ట్యాగ్ · 2 కథనాలు

ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా

జపాన్ లో రజనీకాంత్ హవా
“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు తో పాటు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ హీరోగా రూపొందిన "అన్నాత్తే " మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు కమల్, రజినీతో కలసి నటించడం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవకాశాలను అందుకున్న వారిలో యువ కథానాయిక నివేదా థామస్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా నటించే అవకాశం దక్కడం గమనార్హం.