ట్యాగ్ · 4 కథనాలు
వర్మ 'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ రిలీజ్
'వర్మ' బయోపిక్ షూటింగ్ మొదలు
"సైకో వర్మ " మూవీ షూటింగ్ ప్రారంభం
థియేటర్ లో మొదటి సినిమా నాదే
మొత్తానికి థియేటర్లు తెరుచుకునే టైం వచ్చేసింది. లాక్ డౌన్ వల్ల గత 8 నెలల నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి. లాక్ డౌన్ తీసినా కూడా థియేటర్స్ కు మోక్షం రాలేదు ఇన్ని రోజులు. ఇక ఎంతో మంది సినీ లవర్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీకే కాదు.. సినీ లవర్స్ కు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వర్మ 'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ రిలీజ్
సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో సంచలన కథతో రాబోతున్నాడు వర్మ. గత ఏడాది దిశ హత్యాచారం సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్కౌంటర్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు అన్నీ ట్రైలర్ లో చూపించాడు.
'వర్మ' బయోపిక్ షూటింగ్ మొదలు
ఇప్పటివరకూ యదార్థ సంఘటనల ఆధారంగా.. పలువురి జీవిత చరిత్రల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మీద పలువురు బయోపిక్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ ను రాము అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.
"సైకో వర్మ " మూవీ షూటింగ్ ప్రారంభం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టాలీవుడ్ లో పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ కూడా తన బయోపిక్ మూవీ ని మూడు పార్ట్ లుగా రూపొందిస్తున్నారు.ఒక దర్శకుడి కి వ్యతిరేకంగా మూవీస్ రూపొందడం తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మొదటిసారి. ఇప్పుడు వర్మ కు వ్యతిరేకంగా మరో మూవీ "సైకో వర్మ " రూపొందుతుంది.