ట్యాగ్ · 4 కథనాలు
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్

పెళ్లి వాయిదా తప్పట్లేదు..!
డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ - ఇప్పుడే డైరెక్ట్ చేయను
హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.
ఎక్స్పపరిమెంటల్ సినిమాతో డైరెక్టర్ గా మారనున్న నిఖిల్..!
లాక్ డౌన్ లో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో కొత్త విషయాన్ని నేర్చుకునే పనిలో పడ్డారు. కొంతమంది తాము మధ్యలో వదిలేసిన కళలను నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రైటింగ్ పై దృష్టి పెట్టి కథను కూడా రాసిన సంగతి విదితమే. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త అడ్వెంచర్’ అంటూ అప్పుడే ట్విట్టర్ లో తెలిపాడు. .
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.

పెళ్లి వాయిదా తప్పట్లేదు..!
ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అని యంగ్ హీరో నిఖిల్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆపేసి అందరూ ఇంటికే పరిమితమైన తరుణంలో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిఖిల్ ప్రకటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో మేము వివాహం చేసుకోవడం సాధ్యమవుతుందని నేను అనుకోను. అందుకే మా వివాహాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని నిఖిల్ తెలిపాడు.