
ట్యాగ్ · 5 కథనాలు


మనోజ్ మంచు మంచి నిర్ణయం
మెగా - మంచు దీపావళి
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మనోజ్ హై కిక్ - సీరియస్ వర్కౌట్స్

మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్..!
మళ్లీ సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు మళ్లీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఈవిషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ''నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల నుంచి నాతో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు'' అని మనోజ్ ట్వీట్ చేశాడు.

మనోజ్ మంచు మంచి నిర్ణయం
సూపర్ హిట్ "మేజర్ చంద్రకాంత్ " మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మనోజ్ మంచు "దొంగ దొంగది "మూవీ తో హీరోగా మారి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మనోజ్ ప్రస్తుతం తన స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో మనోజ్ మంచు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు. "అహం బ్రహ్మస్మి "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మెగా - మంచు దీపావళి
మెగా ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు చిరు,మోహన్ బాబు సరదాగా కౌంటర్లు వేసుకున్నా రెండు ఫ్యామిలీస్ మధ్య బంధం వేరు. కేవలం ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే కాదులెండి టాలీవుడ్ లో అక్కినేని,మెగా,నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ దాదాపు సన్నిహిత్యంగానే ఉంటాయి. ఇక హీరోస్ మంచు మనోజ్, చరణ్, ఎన్టీఆర్, రానా, మహేష్ వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అందరికీ తెలుసు.
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
మనోజ్ హై కిక్ - సీరియస్ వర్కౌట్స్
చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.