ట్యాగ్ · 2 కథనాలు
కొత్త సినిమా వివరాలు త్వరలో..!
మనోజ్ హై కిక్ - సీరియస్ వర్కౌట్స్
చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.
కొత్త సినిమా వివరాలు త్వరలో..!
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.