ట్యాగ్ · 2 కథనాలు

మణిరత్నం కొత్త చిత్రం వివరాలు
"పొన్నియిన్ సెల్వన్ " మూవీ అప్ డేట్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణ మూర్తి నవల "పొన్నియిన్ సెల్వన్ " ఆధారంగా హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుపుకున్న "పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో జరుపుకుంది. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

మణిరత్నం కొత్త చిత్రం వివరాలు
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. గత ఏడాది భారీ తారాగణంతో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) సినిమాను తెరకెక్కించిన ఈ లెజెండరీ డైరెక్టర్… ఇప్పుడు మరోసారి అదే బాటలో తన అప్‌కమింగ్ మూవీని కూడా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మణి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు మోహన్ బాబు, విక్రమ్, కార్తీ…