కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akkineni Nagarjuna Upcoming Movie Details

ట్యాగ్ · 5 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

అన్ని జాగ్రత్తలతో 'వైల్డ్ డాగ్' షూట్ మొదలు

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్‌తో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్‌లో పాల్గొననున్న‌ట్టు తెలిపారు. ఇక తాజాగావైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నారు నాగ్. అంతేకాదు వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడం చాలా ఫన్ గా ఉందని.. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నామని.. ఒక వీడియో కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు వైల్డ్ డాగ్ తర్వాత…

TFN Adminవాట్సాప్
Wild Dog Movie Team Unveils First Look Movie Poster On Akkineni Nagarjuna Birthday
ఫస్ట్ లుక్

డేర్ డెవిల్ కు హ్యాపీ బర్త్ డే

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని అగ్ర హీరో స్థాయి రేంజ్ కు ఎదిగారు టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మధుడు అనే బిరుదుకు తగ్గట్టేఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఆ బిరుదుకు సార్ధకం చేస్తున్నారు. క్లాస్.. మాస్ సినిమాలే కాదు భక్తిరస చిత్రాలకు కూడా నాగ్ కేరాఫ్ అడ్రస్. తన ఇన్నేళ్ల సినీప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించారు. ఇక ఈ రోజు నాగ్ పుట్టినరోజు కావడంతో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానికి బ్రెయిన్ ట్యూమర్ - నాగార్జున ఫోన్ కాల్

కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. తమ హీరోలకు అభిమానులంటే ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

నాగ్ 'వైల్డ్ డాగ్' టీజర్ అప్పుడేనా..?

గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ నాగార్జున. అయితే ఆ సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే…

TFN Adminవాట్సాప్

షేర్