ట్యాగ్ · 4 కథనాలు
'బిగ్ బాస్ 4' లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను
బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా…

'BB' అంటే అది కాదు - కన్ఫ్యూజ్ చేస్తున్న నందు
బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంతో పకడ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్-4 షోలో మొత్తం 16 మంది పాల్గొనబోతుండగా మరోసారి హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జరగనున్నట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?
‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది లాస్య. తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. వారికి ఒక బాబు కూడా వున్నాడు. ప్రస్తుతం భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. అయితే తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది.
బిగ్ బాస్ 4.. 50 రోజులు మాత్రమే..!
కరోనా ప్రభావం కేవలం వెండి తెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా పడింది. ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ షూటింగ్స్ లేక ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ. ఇప్పుడిప్పుడే చిన్నగా సీరియల్, పలు ప్రోగ్రామ్స్ షూటింగ్ లు స్టార్ట్ చేసారు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.