
ట్యాగ్ · 2 కథనాలు

అప్పట్లో ఇలా.. యాక్టర్ అయిపోదామనుకున్నా..!

సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!
రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
అప్పట్లో ఇలా.. యాక్టర్ అయిపోదామనుకున్నా..!
సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అంత సులువేం కాదు. ఒకవేళ ఏదో ఒకరకంగా వచ్చినా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. హార్డ్ వర్క్ తో పాటు లక్.. లక్ తోపాటు టాలెంట్ ఇలా అన్నీ ఒకదానికొకటి కలిసొస్తేనే తప్పా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా సోనూ సూద్ ట్విట్టర్ లో తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ తనపై తానే కామెడీ చేసుకున్నాడు. హేండ్సప్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు సోను సూద్. 'సూపర్' చిత్రం తొలి బ్రేక్నిస్తే.. 'అరుంధతి' చిత్రం సోనూ సూద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. ఆ తరువాత పలు తెలుగు చిత్రాలలో విలన్‌గా…