కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bollywood Actor Sonu Sood Latest Photos

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

సోనూసూద్ కు ప్రకాష్ రాజ్ సత్కారం

ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూద్. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చ‌డం ద‌గ్గ‌ర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే

సోనూసూద్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవరున్నారు. సినిమాల వల్ల కొంతమందికే తెలిసినా.. కరోనా వల్ల సోనూసూద్ పేరు అందరికీ పరిచయమైంది. ఈ పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు, విదేశాలలో ఉండిపోయిన భారతీయుల కోసం ఆయన అనేక సేవలు చేసారు. అంతేకాదు కష్టంలో ఉన్నామని ట్వీట్స్ చేసిన వారిని కూడా సోనూ తనదైన తరహాలో ఆదుకున్నాడు... ఆదుకుంటూనే వున్నాడు.

TFN Adminవాట్సాప్
Bollywood Actor Sonu Sood Spreads The Message Of Giving Back To Society With His Philanthropic Activities
సినిమా వార్తలు

సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్‌డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పట్లో ఇలా.. యాక్టర్ అయిపోదామనుకున్నా..!

సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అంత సులువేం కాదు. ఒకవేళ ఏదో ఒకరకంగా వచ్చినా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. హార్డ్ వర్క్ తో పాటు లక్.. లక్ తోపాటు టాలెంట్ ఇలా అన్నీ ఒకదానికొకటి కలిసొస్తేనే తప్పా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా సోనూ సూద్ ట్విట్టర్ లో తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ తనపై తానే కామెడీ చేసుకున్నాడు. హేండ్స‌ప్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌టుడు సోను సూద్‌. 'సూప‌ర్' చిత్రం తొలి బ్రేక్‌నిస్తే.. 'అరుంధ‌తి' చిత్రం సోనూ సూద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్క‌సారిగా మార్చివేసింది. ఆ త‌రువాత పలు తెలుగు చిత్రాల‌లో విల‌న్‌గా…

TFN Adminవాట్సాప్

షేర్