30 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ..!

Yesteryear Actress Amala Akkineni To Make Her Comeback In To Tollywood With Sharwanand Movie After 30 Years

30 ఏళ్ళ తర్వాత మళ్లీ ఏంటబ్బా.. ఇప్పటికే లైఫ్ 2012లో రిలీజ్‌ అయిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది కదా అని డౌట్ వచ్చింది కదా. అయితే తెలుగులో కాదులెండి. తమిళ్ లో దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతుంది. శర్వానంద్‌ హీరోగా తెలుగు, తమిళంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌కు తల్లిగా అమల నటిస్తుంది. ఈ సినిమాలో అమలకు జోడీగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత అమల కోలివుడ్‌లోనూ బిజీ అవుతుందేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ పాత్రలో అమల నటిస్తున్నట్టు సమాచారం. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లో ఛాంపియన్ గా ఎదగడానికి సుబ్బరావమ్మ గారి పాత్ర చాలా వుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు అమల అయితే సరిపోతుందని తనను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పెళ్లికి ముందు ఎన్నో సినిమాల్లో నటించిన అమల, పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. 1992లో ‘కార్పూరా ముల్లై’ అమల నటించిన చివరి సినిమా. ఆ తర్వాత నాగార్జున్‌తో ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2012లో రిలీజ్‌ అయిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =