
ట్యాగ్ · 4 కథనాలు


బాలకృష్ణ చాలా మంచి మనిషి..!
టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?

అది ఎన్టీఆర్ ఇష్టం..!
తన తాత పోలికలే కాదు.. ఆ వాక్చాతుర్యం.. ఆ గాంభీరత్వం అన్ని పుణికి పుచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లో ఎలాగూ స్టార్ హీరో అయ్యాడు. అయితే సినిమాలతో పాటు తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. దానికి కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే.

బాలకృష్ణ చాలా మంచి మనిషి..!
నందమూరి బాలకృష్ణ పైకి కాస్త గంభీరంగా.. కోపిష్టిగా కనపడినా ఆయన గురించి సినీ ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా మాత్రం చాలా మంచివారని.. చిన్న పిల్లల మనస్తత్వం అని చెపుతుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అదే చెబుతుంది. ఆమె ఎవరో కాదు ఛార్మి. హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛార్మి.. తన కెరీర్లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకోలేక పోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నటనకు దూరంగా వుంటూ.. పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇటీవలే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది.
టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?
నటసింహ బాలకృష్ణ, నిన్నటితరం అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్‌ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 5 చిత్రాలు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు సంచలనం సృష్టించాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు'.. ఇలా బాలయ్య, గోపాల్ కాంబినేషన్‌లో 4 బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. కట్ చేస్తే.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది.
బోయపాటి సినిమాలో బాలయ్య విలన్ కాదట...!
బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.