ట్యాగ్ · 2 కథనాలు

అది ఎన్టీఆర్ ఇష్టం..!
వచ్చే ఏడాదే అంటున్న బాలకృష్ణ..!
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఈ సినిమా షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్ లకు వెళ్లే ఆలోచనలో మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. లాక్ డౌన్ లో సడలింపులు చేయడం.. రోజు రోజుకు కేసులు కూడా పెరగడమే దీనికి కారణం. మరోవైపు షూటింగ్స్ చేయాలంటే పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం షూటింగ్లను మొదలుపెట్టాలని చూస్తున్నారు... కొంతమంది మాత్రం లేట్ అయినా పర్లేదు అని వెనక్కి తగ్గుతున్నారు.

అది ఎన్టీఆర్ ఇష్టం..!
తన తాత పోలికలే కాదు.. ఆ వాక్చాతుర్యం.. ఆ గాంభీరత్వం అన్ని పుణికి పుచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లో ఎలాగూ స్టార్ హీరో అయ్యాడు. అయితే సినిమాలతో పాటు తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. దానికి కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే.