
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గత ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, దర్శకుడు హెచ్.వినోద్. కాగా, ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో `వలిమై` పేరుతో మరో సినిమా రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నాడని సమాచారం.